![]() |
చిలిపి చిరుగాలికి ఎగిరొచ్చిన నీ ప్రేమ , ఎన్ని ఉప్పెనలు వచ్చినా కధలనంటోంది, అది నీ ప్రేమ గొప్పతనమో ?, నా మనస్సు బేల తనమో, ? ప్రేమకున్న గుణమో? ******************************************* |
తలుపులయితే మూసుకున్నావు
కానీ తలపులను ఏంచేస్తావు
అవి నాకులాగా తలవొంచుకొని పోతాయా
తొంగి తొంగి చూస్తూనే వుంటాయి .
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

నువ్వు నా పక్కన ఉంటె ఎంత బాగుండేదో తెలుసా!
ఈ సముద్రము చల్ల చల్లని పిల్ల గాలులు ......
ఈ సంజె చీకట్లో సముద్రాన్ని చూస్తుంటే ....
నీ కురులే ఈ సముద్ర తరంగాలుగా ....
ఈ సముద్రపు అలలు .....
నువ్వు నాకు పంపించే నిశబ్ద సందేశాలుగా........
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥ |
0 comments:
Post a Comment