Thursday, 17 September 2015

చిలిపి చిరుగాలికి

చిలిపి చిరుగాలికి ఎగిరొచ్చిన నీ ప్రేమ ,

ఎన్ని ఉప్పెనలు వచ్చినా కధలనంటోంది,

అది నీ ప్రేమ గొప్పతనమో ?,

నా మనస్సు బేల తనమో, ?

ప్రేమకున్న గుణమో?

*******************************************


తలుపులయితే మూసుకున్నావు 

కానీ తలపులను ఏంచేస్తావు

అవి నాకులాగా తలవొంచుకొని పోతాయా 

తొంగి తొంగి చూస్తూనే వుంటాయి .

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@




సత్యం నీలోని ప్రేమ నిత్యం

వెలలేని పుష్ప గుచ్చం

ఆ ప్రేమే ఆణిముత్యం

అది ఎంతో ఎంతో స్వచ్చం

నిజమైనా ప్రేమకర్ధం

ని మనసు కాక అర్ధం

నికింక కాదు అర్ధం

అది అర్ధమైతే

ప్రేమే జగమని తెలియును నీ మది

********************************************











నువ్వు నా పక్కన ఉంటె ఎంత బాగుండేదో తెలుసా!



ఈ సముద్రము చల్ల చల్లని పిల్ల గాలులు ......



ఈ సంజె చీకట్లో సముద్రాన్ని చూస్తుంటే ....



నీ కురులే ఈ సముద్ర తరంగాలుగా ....



ఈ సముద్రపు అలలు .....


నువ్వు నాకు పంపించే నిశబ్ద సందేశాలుగా.......
.





నీ జ్ఞాపకాల రూపంలో
మదిదోచిన మువ్వల సవ్వడి మరువ గలనా

                                                                               

ఎవరివో నీవు.


నాకు తెలియదు.


' కాని'


నిన్ను చూసాకే తెలిసింది.


నాకు ఒ మనసుందని.